ఎల్నినో ప్రభావంపై రేవంత్ సూచనలు.. హరీష్ శంకర్ మద్దతు
తెలంగాణ
ఎల్నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశాల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచనలపై ప్రముఖ సినీ దర్శకుడు హరీష్ శంకర్ సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్లో గతంలో వేసవి కాలంలో రోజుకు 6 నుంచి 7 వేల వాటర్ ట్యాంకర్లు అవసరమయ్యేవని, ప్రస్తుతం అక్టోబర్లోనే 7,500 వాటర్ ట్యాంకర్లు అవసరమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులు నీటి వినియోగంపై ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ నీటితో పాటు విద్యుత్ను కూడా పొదుపుగా వినియోగించాలని సూచించారు. నీటి సంరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రజలంతా ఆచరించాలని పిలుపునిచ్చారు.