అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పనులపై సమీక్ష
నగర భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం
వరంగల్: నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ సేవల మెరుగుదల లక్ష్యంగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పనులపై రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి, సీడీఎంఏ డాక్టర్ టి.కె. శ్రీదేవి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నగరంలో ఆర్థిక కార్యకలాపాల విస్తరణ, రవాణా ఆధారిత అభివృద్ధి, ప్రాంతీయ ప్రణాళిక, పట్టణ పునరుద్ధరణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, నగర ప్రాంతాల పునరాభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలపై సమీక్షించారు.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగరంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, పట్టణ సేవలను మరింత మెరుగుపరచడం, దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడంపై అధికారులు చర్చించారు.