రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం
రోహిత్ కుటుంబాన్ని పరామర్శించి నగదు అందజేసిన ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్దాస్ విక్రమ్
యాదాద్రి భువనగిరి: రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన బాణాల గోపాల్ కుమారుడు రోహిత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం రామన్నపేట శివారులో రోహిత్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాద సమాచారం అందుకున్న గ్రామస్థులు, స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రోహిత్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్దాస్ విక్రమ్ రోహిత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అత్యవసర వైద్య ఖర్చుల కోసం తన వంతుగా రూ.10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. రోహిత్‌కు మెరుగైన వైద్యం అందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సిబ్బందిని కోరారు.