BREAKING
thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు! thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు! thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం
మంచి మాట
Date of Publish : 24 October 2026, 10:02 am
Posted by : SEETHA KIRAN KUMAR

హైదరాబాద్ విమానాశ్రయంలో రూ.1.55 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
24 Oct, 2026 - 10:02 AM
31 వీక్షణలు
  • ఇద్దరు భారతీయ ప్రయాణికుల అరెస్ట్
  • దుస్తుల మధ్య నల్లటి కవర్లలో కరెన్సీ దాచినట్లు గుర్తించిన డీఆర్‌ఐ అధికారులు
  • ఇద్దరి బ్యాగుల్లో విదేశీ కరెన్సీ
  • కరెన్సీతో పాటు ట్రాలీ బ్యాగుల సీజ్

హైదరాబాద్ | ఎన్ టుడే న్యూస్: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 22, 23 తేదీల్లో చేపట్టిన తనిఖీల్లో ఇద్దరు భారతీయ ప్రయాణికులను అరెస్ట్ చేశారు.

నిర్దిష్ట సమాచారం ఆధారంగా తనిఖీలు చేపట్టిన డీఆర్‌ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు ఒక ప్రయాణికుడి బ్యాగులో 66,600 అమెరికన్ డాలర్లు, 3,773 మలేషియా రింగిట్‌లు, 2 సింగపూర్ డాలర్లను గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.63.62 లక్షలుగా అంచనా వేశారు.

అదే విమానంలో వేరే పీఎన్‌ఆర్‌పై ప్రయాణిస్తున్న మహిళను తనిఖీ చేయగా, ఆమె బ్యాగులో 97,600 అమెరికన్ డాలర్లు లభించాయి. వీటి విలువ సుమారు రూ.91.94 లక్షలుగా అధికారులు పేర్కొన్నారు.

ఇద్దరూ తమ ట్రాలీ బ్యాగుల్లో దుస్తుల మధ్య నల్లటి ప్లాస్టిక్ కవర్లలో విదేశీ కరెన్సీని దాచినట్లు అధికారులు గుర్తించారు. కరెన్సీని చట్టబద్ధంగా పొందినట్లు, తరలిస్తున్నట్లు నిరూపించే పత్రాలను వారు సమర్పించలేకపోయినట్లు సమాచారం.

మొత్తంగా 1,64,200 అమెరికన్ డాలర్లు, 3,773 మలేషియా రింగిట్‌లు, 2 సింగపూర్ డాలర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ చట్టం–1962 ప్రకారం విదేశీ కరెన్సీతో పాటు ట్రాలీ బ్యాగులను సీజ్ చేసి, ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.