అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి సీఎం సహాయనిధి ద్వారా రూ.2 లక్షల ఎల్ఓసీ
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల: అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్‌కు చెందిన బత్తుల మల్లేష్‌కు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా చికిత్స ఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల విలువైన ఎల్ఓసీని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు అందజేశారు.
ఈ ఎల్ఓసీని మల్లేష్ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఇంటక్ అధ్యక్షుడు పూదరి తిరుపతి పాల్గొన్నారు.