BREAKING
thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం
Date of Publish : 16 October 2026, 07:44 pm
Posted by : SEETHA KIRAN KUMAR

తెలంగాణలో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లకు రూ.425.50 కోట్ల అనుమతులు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
16 Oct, 2026 - 07:44 PM
9 వీక్షణలు

రెండు దశల్లో స్టేషన్ల ఏర్పాటు.. వాహనాల ఫిట్‌నెస్ పరీక్షల్లో ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల (ఏటీఎస్‌) ఏర్పాటుకు రూ.425.50 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రవాణా, రహదారులు, భవనాల శాఖ అక్టోబర్ 15న జీఓ ఎంఎస్ నంబర్ 50ను విడుదల చేసింది.

వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ స్టేషన్లను రెండు దశల్లో ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో 15 స్టేషన్లను, రెండో దశలో మరో 22 స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గతంలో ఒక్కో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌కు రూ.8 కోట్ల చొప్పున మొత్తం రూ.296 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. తాజాగా ఒక్కో స్టేషన్ వ్యయాన్ని రూ.11.50 కోట్లకు పెంచడంతో మొత్తం అంచనా వ్యయం రూ.425.50 కోట్లకు చేరింది. మొదటి దశలోని 15 స్టేషన్లకు రూ.172.50 కోట్లు, రెండో దశలోని 22 స్టేషన్లకు రూ.253 కోట్లు కేటాయించారు.

స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ కోసం రవాణా శాఖ పరిధిలో ప్రత్యేక ప్రయోజన సంస్థ (SPV) ఏర్పాటు చేయనున్నారు. ఈ సంస్థను స్వయం ఆర్థిక నమూనాలో నిర్వహించేలా చర్యలు చేపట్టనున్నారు. అవసరమైన నిధులను హడ్కో వంటి ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో సమీకరించి, ఫిట్‌నెస్ పరీక్షల దరఖాస్తు రుసుము, పరీక్ష రుసుము, వినియోగదారు ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయాన్ని రుణాల చెల్లింపులకు వినియోగించేలా ప్రతిపాదించారు. 

వాహనాల ఫిట్‌నెస్ పరీక్షల్లో ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వడం, పరీక్షల ప్రక్రియలో పారదర్శకతను పెంచడం, రాష్ట్ర రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు.