BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 15 October 2026, 3:39 pm Posted by : NTODAY NEWS

మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు

అమడగూరు (ఎన్‌ టుడే న్యూస్‌): సినీనటుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కదిరి మెగా యూత్ ఫోర్స్ సభ్యులు అమడగూరులోని మాతృశ్రీ వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు భోజన సదుపాయం కల్పించి సేవా కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా వృద్ధాశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినీ రంగంలోకి ప్రవేశించిన సాయి ధరమ్ తేజ్ తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఆయన మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. జన్మదినాన్ని పురస్కరించుకుని వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించిన మెగా యూత్ ఫోర్స్ కదిరి బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

మెగా యూత్ ఫోర్స్ కదిరి నియోజకవర్గ కన్వీనర్ దాసరి కార్తీక్ మాట్లాడుతూ.. ఆదరణకు నోచుకోని వృద్ధులకు మాతృశ్రీ వృద్ధాశ్రమం ద్వారా ఆశ్రయం కల్పిస్తూ సేవలందిస్తున్న నిర్వాహకురాలు అరుణజ్యోతిని అభినందించారు. వృద్ధుల మధ్య సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. మెగా కుటుంబ అభిమానులు సేవా కార్యక్రమాల్లో ముందుండటం ఆనందంగా ఉందని పేర్కొంటూ సాయి ధరమ్ తేజ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి మార్గదర్శకత్వం అందిస్తున్న మెగా యూత్ ఫోర్స్ జాతీయ కన్వీనర్ ఏడిద బాబీ, ఫౌండర్ సుస్మిత, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులకు దాసరి కార్తీక్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా కో-కన్వీనర్ లక్ష్మణ కుటాల, జాయింట్ కన్వీనర్ మంగళమడక మనోహర్, కమిటీ సభ్యులు హరిబాబు, కరము మిథున్, ముని గోపాల్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Date of Publish : 15 October 2026, 03:39 pm
Posted by : NTODAY NEWS

మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
15 Oct, 2026 - 03:39 PM
13 వీక్షణలు