BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 06 January 2026, 04:25 am
Posted by : NTODAY NEWS OFFICIAL

తెలంగాణలో స్కూళ్లకు సంక్రాంతి సెలవుల ప్రకటన

తెలంగాణ
06 Jan, 2026 - 04:25 AM
234 వీక్షణలు

తెలంగాణలో స్కూళ్లకు సంక్రాంతి సెలవుల ప్రకటన

జనవరి 10 నుంచి 16 వరకు సెలవులు 17న తిరిగి తెరుచుకోనున్న పాఠశాలలు విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ NTODAY NEWS: హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి పండుగ సెలవులను అధికారికంగా ఖరారు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈ. నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు సెలవులు వర్తించనున్నాయి. జనవరి 15న సంక్రాంతి పండుగ ఉండగా, జనవరి 16న కనుమ పండుగను ప్రభుత్వం ముందుగా ‘ఐచ్ఛిక సెలవు’గా ప్రకటించింది. అయితే పండుగలు వరుసగా ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల సౌకర్యార్థం జనవరి 16ను కూడా సాధారణ సెలవుగా మార్చుతూ సెలవులను పొడిగించారు. 17న స్కూళ్లు రీ-ఓపెన్ వరుస సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు జనవరి 17 (శనివారం) నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు (DEOs), ప్రాంతీయ విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఈ ఏడాది సంక్రాంతికి విద్యార్థులకు వరుసగా 7 రోజుల సెలవులు లభించనున్నాయి. ముఖ్య వివరాలు: మొత్తం సెలవులు: 7 రోజులు (జనవరి 10–16) ముఖ్య పండుగలు: జనవరి 14 (భోగి), 15 (సంక్రాంతి), 16 (కనుమ) పాఠశాలలు తిరిగి ప్రారంభం: జనవరి 17 Follow us on Website Facebook Instagram YouTube