ఘనంగా సర్దార్ పండుగ సాయన్న జయంతి వేడుకలు
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామ పంచాయతీలో సర్దార్ పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 18వ శతాబ్దంలో నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసిన పోరాట యోధులలో పండుగ సాయన్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరియు సాయన్న ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందజేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ రెడ్డితో పాటు అన్నెపు కార్తీక్, ఈరమళ్ళ బాలరాజ్, ముత్యాలు, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.