ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్
లబ్ధిదారుడి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి
యాదాద్రి భువనగిరి: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ఐదో వార్డుకు చెందిన మహమ్మద్ గులాంనబీకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో నూతన గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి పాల్గొని లబ్ధిదారుడికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి లబ్ధిదారుడి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మందుగుల బాలకృష్ణ, ఏపూరి సతీష్, స్ఫూర్తి కళాశాలల చైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్, ఐదో వార్డు సభ్యురాలు కట్ల వనజ భాస్కరాచారి, గ్రామ శాఖ అధ్యక్షుడు బద్దుల మురళి యాదవ్, భూపని బలరాం, గ్రామ శాఖ సహాయ కార్యదర్శి రేవనపల్లి గోపాల్, మరగోని శంకర్ గౌడ్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, కారోబార్ పున్నం యాదగిరి, వడ్డేపల్లి శివప్రసాద్, బానోతు కిరణ్ నాయక్, దుర్గం లింగస్వామి, కుటుంబ సభ్యులు అల్తాఫ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.