వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు
- వెల్లంకి గ్రామంలో నూతన బోరు తవ్వకం.. మూడు అంగుళాల నీటి లభ్యత
రామన్నపేట | ఎన్ టుడే న్యూస్ | అక్టోబర్ 25:
రాబోయే వేసవిలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ తెలిపారు. ఇందులో భాగంగా గ్రామంలో నూతన బోరు తవ్వకాన్ని చేపట్టారు.
శివాలయం పక్కన బోరు తవ్వకం
వెల్లంకి గ్రామంలోని శివాలయం పక్కన సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ ఆధ్వర్యంలో బోరు తవ్వకం చేపట్టగా, మూడు అంగుళాల మేర నీరు పడినట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో రాబోయే వేసవిలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు కొంత ఉపశమనం లభిస్తుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.
గ్రామంలో నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు జువ్వగొని మల్లమ్మ, వనం సత్తయ్య, తాటిపాముల శ్రీను, తాటిపాముల నరసింహ, బలికే లక్ష్మయ్యతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.