జనంపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఆగు సత్యనారాయణ నియామకం
నూతన కమిటీకి ఎమ్మెల్యే వేముల వీరేశం శుభాకాంక్షలు
రామన్నపేట, అక్టోబర్ 23: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామశాఖ అధ్యక్షుడిగా నియమితులైన ఆగు సత్యనారాయణ, కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం నూతన గ్రామశాఖ అధ్యక్షుడు, కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరోజా అంజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ బండ దామోదర్ రెడ్డి, గ్రామ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.