BREAKING
thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి thumb ● పోలింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన పులివెందుల ఆర్డీవో చెన్నయ్య thumb ● యర్రిపల్లిలో పులివెందుల వ్యవసాయ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం thumb ● సింహాద్రిపురంలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందులలో జోరందుకున్న మున్సిపల్ పోరు నగరిగుట్టలో కూటమి ముమ్మర ప్రచారం! ​ thumb ● తిరుపతి రూరల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కె. జ్యోతీశ్వర్ నాయక్ నామినేషన్ దాఖలు! thumb ● మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గీతా కుమారి తరఫున తూగుట్ల మధు ముమ్మర ప్రచారం thumb ● పులివెందులలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం జోరు thumb ● వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా పంచామృత అభిషేకం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి thumb ● పోలింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన పులివెందుల ఆర్డీవో చెన్నయ్య thumb ● యర్రిపల్లిలో పులివెందుల వ్యవసాయ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం thumb ● సింహాద్రిపురంలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందులలో జోరందుకున్న మున్సిపల్ పోరు నగరిగుట్టలో కూటమి ముమ్మర ప్రచారం! ​ thumb ● తిరుపతి రూరల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కె. జ్యోతీశ్వర్ నాయక్ నామినేషన్ దాఖలు! thumb ● మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గీతా కుమారి తరఫున తూగుట్ల మధు ముమ్మర ప్రచారం thumb ● పులివెందులలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం జోరు thumb ● వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా పంచామృత అభిషేకం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం!
మంచి మాట
Date of Publish : 23 October 2026, 07:17 pm
Posted by : కూనురు మధు

ఖేత్ బచావో అభియాన్‌లో రైతులకు శాస్త్రవేత్తల సూచనలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
23 Oct, 2026 - 07:17 PM
17 వీక్షణలు
  • ఖేత్ బచావో అభియాన్‌లో రైతులకు శాస్త్రవేత్తల సూచనలు
  • ఎల్‌నినో నేపథ్యంలో ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి..
  • నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

చిట్యాల (ఎన్‌ టుడే న్యూస్‌): ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని మెట్ట పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వ ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు.

హైదరాబాద్‌లోని జాతీయ మెట్ట పరిశోధన సంస్థ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. ఏవీఎం సుబ్బారావు, సీనియర్ సైంటిస్ట్ డా. కీర్తిక ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘పొలాలను కాపాడండి–రైతులను బలోపేతం చేయండి’ అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థిరమైన వ్యవసాయ పద్ధతుల ప్రాధాన్యాన్ని వివరించారు.

రైతులు సమతుల్య ఎరువులను వినియోగిస్తూ నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. భూసారాన్ని పరిరక్షిస్తూ ఆరోగ్యకరమైన పంటలను సాగు చేయడం ద్వారా వ్యవసాయాన్ని స్థిరమైన ఆదాయ వనరుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి బాబు మాట్లాడుతూ, నీటి వినియోగం అధికంగా ఉండే వరి సాగుకు బదులుగా పెసర, మినుము, జొన్న, నువ్వులు, వేరుశనగ వంటి తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేసే అవకాశాలను పరిశీలించాలని రైతులకు సూచించారు. భూగర్భ జలాల లభ్యత, వర్షపాతం పరిస్థితులను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు.

ఆరుతడి పంటలకు అవసరమైన విత్తనాలను వ్యవసాయ శాఖ ద్వారా సమకూర్చనున్నట్లు ఆయన వెల్లడించారు. రైతులు నీటి లభ్యతను అంచనా వేసుకొని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి వాసుదేవ్, చిన్నకాపర్తి గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.