BREAKING
thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదుపై ఉరుమడ్ల గ్రామ నాయకుల అవగాహన thumb ● చౌటుప్పల్‌లో శ్రీరామ జ్యువెలర్స్‌లో అగ్నిప్రమాదం thumb ● ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు thumb ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలిసిన మల్లేపల్లి రాజేందర్ రెడ్డి thumb ● అలయ్ బలయ్–2026 కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదుపై ఉరుమడ్ల గ్రామ నాయకుల అవగాహన thumb ● చౌటుప్పల్‌లో శ్రీరామ జ్యువెలర్స్‌లో అగ్నిప్రమాదం thumb ● ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు thumb ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలిసిన మల్లేపల్లి రాజేందర్ రెడ్డి thumb ● అలయ్ బలయ్–2026 కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం
Date of Publish : 23 October 2026, 12:38 pm
Posted by : SEETHA KIRAN KUMAR

పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 163 అమలు - పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
23 Oct, 2026 - 12:38 PM
45 వీక్షణలు
  • పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 163 అమలు
  • పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 500 మీటర్ల వరకు ఆంక్షలు

వరంగల్ (ఎన్‌ టుడే న్యూస్‌): తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రిక్రూట్‌మెంట్‌ పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 163ను అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్‌ తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించేందుకు ఈ ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు.

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్‌ (అనలిస్ట్‌ గ్రేడ్‌–II), అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం అక్టోబర్‌ 24, 26 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. హనుమకొండ, కాకతీయ యూనివర్సిటీ, మామునూరు, నర్సంపేట పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి.

అక్టోబర్‌ 24, 26 తేదీల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 500 మీటర్ల పరిధిలోని జిరాక్స్‌ కేంద్రాలను పరీక్షా సమయాల్లో మూసివేయాలని ఆదేశించారు. అలాగే ఈ పరిధిలో లౌడ్‌స్పీకర్లు, మైకుల వినియోగంపై నిషేధం విధించారు.

విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది, సైనిక సిబ్బంది, హోంగార్డులతో పాటు నిజమైన అంత్యక్రియల ఊరేగింపులకు ఈ ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత హెచ్చరించారు.