సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దేవభక్తుని సత్యనారాయణ మృతి
మధిర మండలం రామచంద్రాపురంలో విషాదం.. పలువురు నాయకుల సంతాపం
ఖమ్మం జిల్లా మధిర మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, గ్రామ పెద్ద దేవభక్తుని సత్యనారాయణ (పెద్దబ్బాయి, 72) అనారోగ్యంతో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
సత్యనారాయణకు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం, తిరువూరు ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు, ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన మృతి విషయం తెలుసుకున్న గంపలగూడెం మండల టీడీపీ నాయకులు చెరుకూరి రాజేశ్వరరావు, దేవభక్తుని సీతారాం ప్రసాద్, యనమద్ది పుల్లయ్య చౌదరి, మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చెన్నుపాటి శేషగిరిరావు, పెనుగొలను శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావుతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సత్యనారాయణ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలి
పారు.