గుర్రం సుదర్శన్ నేత మృతికి కాంగ్రెస్ నాయకుల నివాళులు
మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన పార్టీ నాయకులు
సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 23: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుర్రం సుదర్శన్ నేత అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సుదర్శన్ నేత మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు. పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మందుగుల బాలకృష్ణ, ఏపూరి సతీష్, నారాయణపురం మాజీ సర్పంచ్ కొన్‌రెడ్డి నరసింహ, వార్డు సభ్యులు సూరపల్లి వెంకటేష్, కట్ల వనజ భాస్కరాచారి, పద్మశాలి సహకార సంఘం చైర్మన్ చిలుకూరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి రాచకొండ రమేష్ బాబు, చిలువేరు వెంకటేష్, గ్రామశాఖ సహాయ కార్యదర్శి రేవనపల్లి గోపాల్, విలేకరులు సంగిశెట్టి ధనంజయ, సింగం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.