BREAKING
thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు thumb ● డిసెంబర్‌ 13న హనుమకొండలో అయ్యప్ప మహా సంగమం thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం యూత్‌ అధ్యక్షుడిగా జక్కల శివ యాదవ్‌ thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు thumb ● డిసెంబర్‌ 13న హనుమకొండలో అయ్యప్ప మహా సంగమం thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం యూత్‌ అధ్యక్షుడిగా జక్కల శివ యాదవ్‌ thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం
మంచి మాట
Date of Publish : 24 October 2026, 07:36 pm
Posted by : KOLA MAHESH

సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
Kola Mahesh Munugodu Constituency
24 Oct, 2026 - 07:36 PM
9 వీక్షణలు

పార్థివదేహంపై ఎర్రజెండా కప్పి నివాళులర్పించిన యానాల దామోదర్‌రెడ్డి

వలిగొండ, అక్టోబర్‌ 24 | ఎన్ టుడే న్యూస్‌: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య అకాల మరణం చెందారు. ఆయన పార్థివదేహంపై యాదాద్రి జిల్లా సీపీఐ కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి ఎర్రజెండా కప్పి, పూలమాల వేసి నివాళులర్పించారు.

పేద ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేశారు

ఈ సందర్భంగా యానాల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. పేద కుటుంబంలో జన్మించిన కామ్రేడ్‌ అంజయ్య భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సిద్ధాంతాలకు ఆకర్షితులై ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. పులిపలుపుల రామ లక్ష్మయ్య, ఖాజా మైనుద్దీన్‌, నీలం చెన్నయ్యలతో కలిసి కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేశారని గుర్తుచేశారు.

పదవుల కోసం ఆశపడకుండా పేద ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అంజయ్య పనిచేశారని కొనియాడారు. ఆయన మరణం కుటుంబానికి, భారత కమ్యూనిస్టు పార్టీకి, ఈ ప్రాంత ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు.

నివాళులర్పించిన పార్టీ నాయకులు

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గోదా శ్రీరాములు, మండల సహాయ కార్యదర్శి ఎల్లంకి మహేష్‌, శాఖ కార్యదర్శి పులిపలుపుల మల్లేశం, అంబటి అంజయ్య, తాలూకా యాదయ్య, గుండెగాని అంజయ్య, ఏఐవైఎఫ్‌ మండల సహాయ కార్యదర్శి గుండెగాని నాగరాజు, పైల యాదయ్య తదితరులు పాల్గొని కామ్రేడ్‌ అంజయ్యకు నివాళులర్పించారు.