కొంపల్లిలో కుక్కపై లైంగిక దాడి.. సెక్యూరిటీ గార్డుపై ఫిర్యాదు
- సాయినగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఘటన
- స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా పోలీసులకు ఫిర్యాదు
- సెక్యూరిటీ క్యాబిన్‌లో ఘటన పోలీసులకు ఫిర్యాదు
కొంపల్లి, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా | ఎన్ టుడే న్యూస్: మూగజీవిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కొంపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డుపై ఫిర్యాదు నమోదైంది. ఈ ఘటన సాయినగర్‌లోని మెఫెయిర్ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్నట్లు సమాచారం.
అందిన వివరాల ప్రకారం.. సంజయ్ తివారీ (50) అనే వ్యక్తి అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 8న అపార్ట్‌మెంట్ ఆవరణలో తిరుగుతున్న ఓ కుక్కను శాలువలో బంధించి సెక్యూరిటీ క్యాబిన్‌లోకి తీసుకెళ్లి, దానిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం కుక్కను అక్కడి నుంచి వదిలేసినట్లు సమాచారం.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు వివరాలు సేకరించారు. అనంతరం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల తదుపరి చర్యలు, దర్యాప్తు వివరాలు తెలియాల్సి ఉంది.