షర్మిల ఇంట పెళ్లి సందడి.. కుమార్తె అంజలి వివాహ ముహూర్తం ఖరారు
ఆంధ్రప్రదేశ్
/
వైఎస్ఆర్ కడప
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆమె కుమార్తె అంజలి రెడ్డి వివాహ ముహూర్తం ఖరారైంది. అమెరికాకు చెందిన వైద్యుడు డాక్టర్ సోమాల రఘురాం రెడ్డితో అంజలి వివాహం జరగనుంది.
కర్నూలు జిల్లాకు చెందిన సోమాల సుబ్బారెడ్డి–పద్మ దంపతుల కుమారుడు రఘురాం రెడ్డి. వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఆయన కుటుంబం అమెరికాలో స్థిరపడింది. ఇరు కుటుంబాల అంగీకారంతో అంజలి–రఘురాం రెడ్డి వివాహం జరగనున్నట్లు సమాచారం.
తన కుమార్తె వివాహ విషయాన్ని వైఎస్ షర్మిల సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. దీంతో షర్మిల కుటుంబంలో పెళ్లి వేడుకల సందడి నెలకొంది. వివాహానికి సంబంధించిన మరిన్ని వివరాలను కుటుంబ సభ్యులు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.