BREAKING
thumb ● చర్లగూడెం ప్రాజెక్టు నుంచి చౌటుప్పల్‌ వరకు పాదయాత్రను జయప్రదం చేయాలి thumb ● గుర్రం సుదర్శన్ నేత మృతికి కాంగ్రెస్ నాయకుల నివాళులు thumb ● వైద్య విద్యార్థిని నిఖితకు రూ.50 వేల ఆర్థిక సాయం thumb ● జనంపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఆగు సత్యనారాయణ నియామకం thumb ● SIR పేరుతో ఓటర్ల హక్కులను హరించే చర్యలను నిలిపివేయాలి thumb ● శివమ్మ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఎల్ ని నొ ప్రభావం పై గ్రామ సభలు రైతులకు అవగాహన thumb ● రాయచోటికి రైల్వే సదుపాయం ఎప్పుడొస్తుంది? thumb ● బంగారు ఆభరణాల విడుదలలో జాప్యం.. ముత్తూట్‌ యాజమాన్యం స్పందించాలి thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి thumb ● చర్లగూడెం ప్రాజెక్టు నుంచి చౌటుప్పల్‌ వరకు పాదయాత్రను జయప్రదం చేయాలి thumb ● గుర్రం సుదర్శన్ నేత మృతికి కాంగ్రెస్ నాయకుల నివాళులు thumb ● వైద్య విద్యార్థిని నిఖితకు రూ.50 వేల ఆర్థిక సాయం thumb ● జనంపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఆగు సత్యనారాయణ నియామకం thumb ● SIR పేరుతో ఓటర్ల హక్కులను హరించే చర్యలను నిలిపివేయాలి thumb ● శివమ్మ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఎల్ ని నొ ప్రభావం పై గ్రామ సభలు రైతులకు అవగాహన thumb ● రాయచోటికి రైల్వే సదుపాయం ఎప్పుడొస్తుంది? thumb ● బంగారు ఆభరణాల విడుదలలో జాప్యం.. ముత్తూట్‌ యాజమాన్యం స్పందించాలి thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి
మంచి మాట
Date of Publish : 23 October 2026, 11:14 pm
Posted by : PAMMI NAVEENKUMAR

టీడీపీకి షాక్‌.. వైఎస్సార్‌సీపీలోకి జొన్నాడ గ్రామ కీలక నేతలు

ఆంధ్రప్రదేశ్
Reporter
pammi naveenkumar రావులపాలెం మండల ప్రతినిధి
23 Oct, 2026 - 11:14 PM
16 వీక్షణలు

చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ నాయకులు

కొత్తపేట: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని జొన్నాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికలు నియోజకవర్గ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో టీడీపీ నియోజకవర్గ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నల్లమిల్లి ప్రసాద్ రెడ్డి (పండు), జొన్నాడ మాజీ టీడీపీ గ్రామ అధ్యక్షుడు వీరి గోవిందు, మండా గీతాకృష్ణ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు.

కూటమి ప్రభుత్వ పాలనపై అసంతృప్తితో, వైఎస్సార్‌సీపీ నాయకత్వంపై నమ్మకంతోనే పార్టీలో చేరినట్లు నాయకులు పేర్కొన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన నాయకులకు చిర్ల జగ్గిరెడ్డి స్వాగతం పలికారు.

టీడీపీలో కీలకంగా వ్యవహరించిన నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరడంతో జొన్నాడ గ్రామంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరింత మంది నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.