వద్దిపర్రులో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 25 కుటుంబాలు
- అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై చేరికలు
- కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
వద్దిపర్రు | ఎన్ టుడే న్యూస్:
స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని వద్దిపర్రు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి.
పేరవరం నీటి సంఘం అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ జోజవరపు హరిబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, యువత టీడీపీలో చేరారు. వీరవల్లి సుబ్రహ్మణ్యంతో పాటు పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై వివిధ గ్రామాల నుంచి వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారని అన్నారు. వద్దిపర్రు గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీఎన్‌టీయూసీ కార్యనిర్వాహక కార్యదర్శి ముళ్లపూడి భాస్కరరావు, మండల తెలుగు యువత అధ్యక్షుడు వెచ్చ అనిల్‌కుమార్, చిటికెన సత్యనారాయణ, గంటి నాగేశ్వరరావు, వజ్రకుమార్, దండు సీతారామరాజు, బంగార్రాజు, గోపాలరాజు, ప్రవీణ్‌తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.