వైఎస్సార్‌సీపీకి షాక్.. జనసేనలో చేరిన చింతగుంట్ల వెంకటేశ్వరరావు
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి: చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మాజీ మండల అధ్యక్షుడు చింతగుంట్ల వెంకటేశ్వరరావు తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్తలు బర్మా ఫణి బాబు, మరీదు శివరామకృష్ణ లో సమక్షంలో ఆయన జనసేన పార్టీలో చేరగా, పార్టీ నాయకులు వారికి స్వాగతం పలికారు. వైఎస్సార్‌సీపీలో గతంలో కీలక బాధ్యతలు నిర్వహించిన వెంకటేశ్వరరావు తన అనుచరులతో కలిసి జనసేనలో చేరడం చాట్రాయి మండల రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానికంగా రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. కొంతమంది పార్టీ విధానాలు నాయకత్వ ధోరణిలో విభేదాల వలన అని మరికొంతమంది అవకాశాల కోసం అని రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి