SIR-2026: ఓటర్ల క్లెయిమ్స్, అభ్యంతరాల కోసం ప్రత్యేక క్యాంపెయిన్
SIR-2026: ఓటర్ల క్లెయిమ్స్, అభ్యంతరాల కోసం ప్రత్యేక క్యాంపెయిన్
సెప్టెంబర్ 5, 6, 12, 13 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు
తెలంగాణ | Ntoday News
తెలంగాణలో SIR-2026 ప్రక్రియలో భాగంగా ఓటర్ల క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 5, 6, 12, 13 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఈ ప్రత్యేక క్యాంపెయిన్ రోజుల్లో ఓటర్లు తమకు సంబంధించిన పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి నిర్ణీత గడువులో క్లెయిమ్స్, అభ్యంతరాలను సమర్పించుకోవచ్చు.
ఓటర్లకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రత్యేక క్యాంపెయిన్ రోజుల్లో సంబంధిత పోలింగ్ స్టేషన్ల వద్ద బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) అందుబాటులో ఉంటారు.
SIR-2026 ప్రక్రియలో తమ ఓటరు వివరాలను పరిశీలించుకోవడంతో పాటు, అవసరమైన మార్పులు లేదా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులో సమర్పించుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు.