BREAKING
thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు thumb ● డిసెంబర్‌ 13న హనుమకొండలో అయ్యప్ప మహా సంగమం thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు thumb ● డిసెంబర్‌ 13న హనుమకొండలో అయ్యప్ప మహా సంగమం
మంచి మాట
Date of Publish : 24 October 2026, 10:26 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

సీఈఐఆర్‌ పోర్టల్‌తో ఆరు మొబైల్‌ ఫోన్ల రికవరీ

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
24 Oct, 2026 - 10:26 PM
60 వీక్షణలు
  • బాధితులకు ఫోన్లు అందజేసిన లక్షెట్టిపేట పోలీసులు
  • పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన బాధితులు

లక్షెట్టిపేట | ఎన్ టుడే న్యూస్‌:

లక్షెట్టిపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వివిధ కారణాలతో పోగొట్టుకున్న ఆరు మొబైల్‌ ఫోన్లను పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. సీఈఐఆర్‌ (CEIR) పోర్టల్‌ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఫోన్ల ఆచూకీ గుర్తించినట్లు ఎస్‌ఐ సురేశ్‌ తెలిపారు.

మాణిక్యం, చింతం శ్రీధర్‌, ఎడ్ల గంగన్న, పర్వీన్‌, అశోక్‌, మహర్షి తదితరులు వివిధ పనుల నిమిత్తం లక్షెట్టిపేట పట్టణానికి వచ్చిన సమయంలో తమ మొబైల్‌ ఫోన్లను పోగొట్టుకున్నారు. బాధితుల ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు, సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా దర్యాప్తు చేపట్టారు. కానిస్టేబుల్‌ సంజీవ్‌కుమార్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఫోన్ల ఆచూకీ గుర్తించడంలో కీలకంగా వ్యవహరించారు.

రికవరీ చేసిన ఆరు మొబైల్‌ ఫోన్లను శనివారం పోలీస్‌స్టేషన్‌లో బాధితులకు అందజేశారు. ఎస్‌ఐ సురేశ్‌ చేతుల మీదుగా ఫోన్లను వారికి అప్పగించారు.

పోగొట్టుకున్న తమ ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. పోలీసుల చొరవకు, సహకరించిన సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మొబైల్‌ ఫోన్లు పోగొట్టుకున్నవారు ఫిర్యాదు చేయడంతో పాటు సీఈఐఆర్‌ పోర్టల్‌ సేవలను వినియోగించుకోవచ్చని పోలీసులు సూచించారు.