BREAKING
thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు thumb ● డిసెంబర్‌ 13న హనుమకొండలో అయ్యప్ప మహా సంగమం thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం యూత్‌ అధ్యక్షుడిగా జక్కల శివ యాదవ్‌ thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు thumb ● డిసెంబర్‌ 13న హనుమకొండలో అయ్యప్ప మహా సంగమం thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం యూత్‌ అధ్యక్షుడిగా జక్కల శివ యాదవ్‌ thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం
మంచి మాట
Date of Publish : 24 October 2026, 07:31 pm
Posted by : కూనురు మధు

పత్తి విక్రయానికి యాప్‌లో స్లాట్ బుకింగ్ తప్పనిసరి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
24 Oct, 2026 - 07:31 PM
47 వీక్షణలు


నల్గొండ జిల్లా చిట్యాల మండలం  ఏపూర్ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కపాస్ కాంతి పథకం కింద ఎంపికైన పత్తి రైతుల చేలల్లో క్షేత్ర దినోత్సవ కార్యక్రమాలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పత్తి దిగుబడులు, మార్కెట్ ధరలు, పత్తి విక్రయ విధానం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో అనుసరించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో పత్తి పంట ఆశించిన స్థాయిలో దిగుబడులు ఇవ్వలేకపోయిందని తెలిపారు. రైతులు పండించిన పత్తిని విక్రయించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారత పత్తి సంస్థ (సీసీఐ) ద్వారా క్వింటాలుకు రూ.8,667 కనీస మద్దతు ధర లభిస్తుండగా, బహిరంగ మార్కెట్‌లో క్వింటాలుకు రూ.9,000 వరకు ధర పలుకుతోందని, పత్తికి మార్కెట్‌లో డిమాండ్ ఉందని వివరించారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించాలనుకునే రైతులు తమ మొబైల్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ‘కపాస్ కిసాన్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. మొబైల్ నంబరు, ఓటీపీ ద్వారా యాప్‌లోకి ప్రవేశించి పత్తి విక్రయానికి స్లాట్ బుక్ చేసుకోవాలని వివరించారు. ఈ యాప్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. పత్తి విక్రయ సమయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే మార్కెటింగ్ శాఖ కార్యదర్శి 7330733599, మండల వ్యవసాయ అధికారి 8977751428 నంబర్లకు సమాచారం అందించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపూర్ గ్రామ సర్పంచ్, వ్యవసాయ విస్తరణ అధికారి నవీన్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.