BREAKING
thumb ● ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలి: కే.బి.ఆర్. నాయుడు thumb ● అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తుటపల్లి రవికుమార్ thumb ● యువ నాయకుడు చిత్రగంటి ప్రవీణ్ మృతి బాధాకరం thumb ● శివన్నగూడెం రిజర్వాయర్కి ఏదుల నుండి నీటి తరలింపులో రాజగోపాల్ రెడ్డి కృషి thumb ● ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ శాసనసభాపతి, శాసనమండలి చైర్మన్ thumb ● చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పర్సబోయిన నరసింహ thumb ● రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జెస్సు అనిల్ కుమార్‌కు ఘన సన్మానం thumb ● నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు thumb ● ఆర్మూర్ జ్యోతిర్లింగ గుడిలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అన్నదానం thumb ● ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలి: కే.బి.ఆర్. నాయుడు thumb ● అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తుటపల్లి రవికుమార్ thumb ● యువ నాయకుడు చిత్రగంటి ప్రవీణ్ మృతి బాధాకరం thumb ● శివన్నగూడెం రిజర్వాయర్కి ఏదుల నుండి నీటి తరలింపులో రాజగోపాల్ రెడ్డి కృషి thumb ● ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ శాసనసభాపతి, శాసనమండలి చైర్మన్ thumb ● చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పర్సబోయిన నరసింహ thumb ● రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జెస్సు అనిల్ కుమార్‌కు ఘన సన్మానం thumb ● నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు thumb ● ఆర్మూర్ జ్యోతిర్లింగ గుడిలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అన్నదానం
మంచి మాట
Date of Publish : 26 October 2026, 03:59 pm
Posted by : SEETHA KIRAN KUMAR

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిడ్నాప్.. కత్తితో బెదిరించి సంతకాలు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
26 Oct, 2026 - 03:59 PM
10 వీక్షణలు
  • హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిడ్నాప్ కలకలం!
  • కత్తితో బెదిరించి పలు డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్న దుండగులు.
  • 112కు ఫోన్ చేయడంతో బాధితుడిని గుర్తించిన పోలీసులు

హైదరాబాద్‌ (ఎన్‌ టుడే న్యూస్‌): హైదరాబాద్‌లోని గోపన్‌పల్లి, ఎన్టీఆర్ నగర్ పరిసరాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్యామ్ నాగ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కారులో తీసుకెళ్లి, కత్తితో బెదిరించి పలు డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నట్లు బాధితుడు తెలిపినట్లు సమాచారం.

వివరాల ప్రకారం.. శనివారం రాత్రి శ్యామ్ నాగ్ తన స్నేహితుడు భార్గవ్‌రాజ్‌తో కలిసి గోపన్‌పల్లిలో మద్యం సేవించారు. అనంతరం భోజనం చేసేందుకు ఎన్టీఆర్ నగర్‌కు వెళ్లిన సమయంలో కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు శ్యామ్ నాగ్‌ను తమ వెంట తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

112కు ఫోన్ చేయడంతో రంగంలోకి పోలీసులు

శ్యామ్ నాగ్ కనిపించకపోవడంతో అతని స్నేహితుడు భార్గవ్‌రాజ్ డయల్ 112కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వెంటనే స్పందించి దర్యాప్తు చేపట్టారు. విచారణలో శ్యామ్ నాగ్ ఆచూకీ గుర్తించి, అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సమాచారం.

నిర్మాణంలో ఉన్న భవనంలోకి తీసుకెళ్లి బెదిరింపులు?

తనను కిడ్నాప్ చేసిన వ్యక్తులు నిర్మాణ దశలో ఉన్న ఓ భవనంలోకి తీసుకెళ్లారని శ్యామ్ నాగ్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అక్కడ కత్తితో బెదిరించి పలు డాక్యుమెంట్లపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని వెల్లడించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటన వెనుక ఉన్న కారణాలు ఏమిటి? బాధితుడితో సంతకాలు చేయించుకున్న డాక్యుమెంట్లు ఏవి? ఈ వ్యవహారంలో ఎంతమంది పాల్గొన్నారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుల గుర్తింపు తదుపరి పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.