హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవన్మరణం
బెట్టింగ్ యాప్‌లో పెట్టుబడులతో ఆర్థిక నష్టం జరిగినట్లు సమాచారం.. మూడు నెలల క్రితమే వివాహం
హైదరాబాద్: నగరంలోని చైతన్యపురిలో విషాద ఘటన చోటుచేసుకుంది. తమ్మిశెట్టి ప్రవీణ్ (34) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
ప్రవీణ్ బెట్టింగ్ యాప్‌లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. ఈ నష్టాల కారణంగా కుటుంబ సభ్యులు, బంధువుల వద్ద పరువు పోతుందనే ఆందోళనకు గురైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
మూడు నెలల క్రితమే ప్రవీణ్‌కు వివాహమైంది. కొత్తగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన అతడు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసుల దర్యాప్తు వివరాలు తెలియాల్సి ఉన్నాయి.