మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
తెలంగాణ
/
హైదరాబాద్
చంద్రనాయక్ తండాలోని నివాసంలో ఘటన
మాదాపూర్ | ఎన్ టుడే న్యూస్:
మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంద్రనాయక్ తండాలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్చన చౌదరి మాలిక్ (29) తన నివాసంలో ఉరివేసుకొని మృతి చెందినట్లు సమాచారం.
అర్చన మైండ్‌స్పేస్‌లోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఆమె మృతిపై సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అర్చన ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.