BREAKING
thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం thumb ● నీటి ఎద్దడి నివారణకు గ్రామసభల్లో అవగాహన thumb ● జాతీయస్థాయి రగ్బీ పోటీలకు వెల్లంకి విద్యార్థినులు ఎంపిక thumb ● బీజేపీ సీనియర్ నాయకుడు సుర్వి జంగయ్యకు నేతల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన thumb ● ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం thumb ● నీటి ఎద్దడి నివారణకు గ్రామసభల్లో అవగాహన thumb ● జాతీయస్థాయి రగ్బీ పోటీలకు వెల్లంకి విద్యార్థినులు ఎంపిక thumb ● బీజేపీ సీనియర్ నాయకుడు సుర్వి జంగయ్యకు నేతల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన thumb ● ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు
Date of Publish : 22 October 2026, 09:46 pm
Posted by : KOLA MAHESH

కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
Kola Mahesh Munugodu Constituency
22 Oct, 2026 - 09:46 PM
9 వీక్షణలు

నూతన 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించిన సీఈ బాలస్వామి

విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సిబ్బందికి సూచన

రామన్నపేట, యాదాద్రి భువనగిరి జిల్లా | ఎన్ టుడే న్యూస్: విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు విద్యుత్ శాఖ సీఈ బాలస్వామి తెలిపారు. గురువారం రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామంలో ఆయన వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. విద్యుత్ సరఫరా, పంటల సాగు, కోతలకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

తక్కువ నీటితో సాగు చేసే పంటలకు ప్రాధాన్యం

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులు తక్కువ నీటితో సాగు చేయగల పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఈ సూచించారు. అధిక నీరు అవసరమయ్యే వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను ఎంచుకోవడం ద్వారా భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించవచ్చని వివరించారు. తద్వారా వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని కూడా ఆదా చేయవచ్చని తెలిపారు.

రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు.

100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

కొమ్మాయిగూడెం గ్రామంలో నెలకొన్న లోవోల్టేజ్ సమస్యను పరిష్కరించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను సీఈ బాలస్వామి ప్రారంభించారు. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు.

పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు

ఈ కార్యక్రమంలో డీఈ డి. మల్లికార్జున్, ఏడీఈ కె. శ్రీకాంత్, ఏఈలు ఎం. కోటేశ్వరరావు, జి. నరసింహ, గ్రామ సర్పంచ్ ఎం. మల్లారెడ్డి, ఉపసర్పంచ్ ఐలయ్య, వార్డు సభ్యులు, కాంట్రాక్టర్ జి. రాంరెడ్డి, విద్యుత్ సిబ్బంది ఎం. నటరాజ్, టి. అశోక్, కె. శ్రీనివాస్ రెడ్డి, కె. సత్తిరెడ్డి, ఎం. సురేష్, ఎం. యాదగిరి, ఎండి. చాంద్ పాల్గొన్నారు.