BREAKING
thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు
Date of Publish : 18 October 2026, 12:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కులరహిత గ్రామంగా సౌందాల.. సామాజిక వివక్షకు చరమగీతం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Oct, 2026 - 12:35 PM
3 వీక్షణలు

మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లాలో ఉన్న సౌందాల గ్రామం కులమతాల పేరుతో కొనసాగుతున్న వివక్షకు స్వస్తి పలుకుతూ సామాజిక సమానత్వం దిశగా అడుగులు వేస్తోంది. సుమారు 450 కుటుంబాలు, 2,500 మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో గతంలో కులాల ఆధారంగా ఇళ్లలోకి ప్రవేశం, మంచినీటి వినియోగం, సహపంక్తి భోజనాలు, ఆలయాలు, పాఠశాలలు, శ్మశానవాటికల విషయంలోనూ వివక్ష ఉండేది. అయితే గ్రామ సర్పంచ్ శరద్ బాబురావు ఆర్గాడే చొరవతో పరిస్థితుల్లో క్రమంగా మార్పు వచ్చింది. గ్రామస్థులందరినీ సమానంగా చూడాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ ప్రయత్నం చివరకు గ్రామాన్ని కులరహిత గ్రామంగా ప్రకటించుకునే స్థాయికి చేరింది.

సర్పంచ్ చొరవతో మార్పునకు శ్రీకారం

సౌందాలకు చెందిన బాబా అట్లాడే సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు భావజాలం కలిగిన వ్యక్తి. ఆయన కుమారుడు శరద్ బాబురావు ఆర్గాడే చిన్నప్పటి నుంచే లౌకిక భావాలు, సమానత్వ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడయ్యాడు. గ్రామంలో కులాల పేరుతో ప్రజల మధ్య కొనసాగుతున్న అంతరాలను తొలగించాలని భావించాడు. సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన ఇంటి నుంచే మార్పును ప్రారంభించాడు. భార్య ప్రియాంకతో కలిసి వివక్షకు గురవుతున్న వర్గాల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకోవడంతోపాటు వారు ఇచ్చే ఆహారపదార్థాలు, పానీయాలను స్వీకరించాడు. మొదట్లో ఈ చర్యలను ఆశ్చర్యంగా చూసిన గ్రామస్థులు, క్రమంగా అదే మార్గంలో నడవడం ప్రారంభించారు. రెండు దశాబ్దాలకు పైగా సాగిన ఈ ప్రయత్నం గ్రామంలో సామాజిక సంబంధాలను మెరుగుపరిచింది.

రక్తదాన శిబిరంతో సమానత్వ సందేశం

గ్రామంలో మిగిలిన కొద్దిపాటి సామాజిక అంతరాలను కూడా తొలగించాలనే ఉద్దేశంతో శరద్ ఆర్గాడే ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలతో సమావేశమయ్యాడు. సామాజిక కార్యకర్త ప్రమోద్ జింజాడే సూచించిన ‘కులరహిత గ్రామం’ భావనను గ్రామస్థుల ముందుంచాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో కులమతాలకు అతీతంగా సుమారు 200 మంది పాల్గొన్నారు. మనుషుల మధ్య కులాలు వేరైనా రక్తం రంగు ఒక్కటేననే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అనంతరం గ్రామసభలో సౌందాలను కులరహిత గ్రామంగా ప్రకటించాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, పాలకవర్గ సభ్యులతోపాటు గ్రామస్థులు ఆమోదించారు.

వివక్షకు తావులేని నిబంధనలు

కులరహిత గ్రామంగా ప్రకటించుకున్న అనంతరం గ్రామ పాలకవర్గం కొన్ని నిబంధనలను అమలు చేస్తోంది. ఇతరుల కులం గురించి అడగడం, కులమతాల ఆధారంగా చిన్నచూపు చూడడం, సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను ప్రేరేపించే పోస్టులు పెట్టడం వంటి చర్యలను నిరుత్సాహపరుస్తోంది. నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు కథనంలో పేర్కొన్నారు. గ్రామంలోని బావులు, పాఠశాలలు, దేవాలయాలు, శ్మశానవాటికలు సహా ఉమ్మడి వనరులను అందరూ సమానంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. పండగలు, వివాహ వేడుకల్లో కులవివక్షకు తావులేకుండా అందరూ కలిసి భోజనాలు చేస్తున్నారు.

సామాజిక అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు

సమానత్వ భావనను బలోపేతం చేయడానికి గ్రామంలో ప్రతిరోజూ ఉదయం పది గంటలకు జాతీయగీతాన్ని లౌడ్‌స్పీకర్ల ద్వారా వినిపిస్తున్నారు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించేందుకు రూ.11 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేస్తున్నారు. వరకట్నాన్ని నిరుత్సాహపరుస్తూ, ఆడపిల్లల వివాహాలకు రూ.5 వేల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

కులమతాల పేరుతో ప్రజల మధ్య ఏర్పడిన గోడలను తొలగించి, సమాన హక్కులు, పరస్పర గౌరవం, సామాజిక ఐక్యతకు ప్రాధాన్యమిస్తున్న సౌందాల గ్రామం సమాజంలో మార్పు ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమనే సందేశాన్ని అందిస్తోంది.