దర్శిలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మిక పర్యటన
ఆంధ్రప్రదేశ్
/
ప్రకాశం
పోలింగ్ కేంద్రాలు, చెక్పోస్టుల తనిఖీ
దర్శి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం దర్శిలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు, చెక్పోస్టులను తనిఖీ చేశారు.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ కోరారు. ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని సూచించారు.