BREAKING
thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం
Date of Publish : 19 February 2026, 02:20 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

సారంగాపూర్ మండలంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు

తెలంగాణ
19 Feb, 2026 - 02:20 PM
197 వీక్షణలు
  సారంగాపూర్ మండలంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు పలు గ్రామాల్లో పూజల్లో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ NTODAY NEWS: సారంగాపూర్ సారంగాపూర్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు. వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లచ్చక్కపేటలో వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం లచ్చక్కపేట గ్రామంలో నిర్వహించిన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో ఆమె పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తేలు రాజు, మాజీ పాక్స్ చైర్మన్ సాగి సత్యం రావు, సర్పంచ్ రమ్య భాస్కర్, మహేష్, మాజీ సర్పంచ్ రమణరావు, నాయకులు ఎండబెట్ల ప్రసాద్, సుమన్, రంజిత్, సాంబారి గంగాధర్, నరేష్, జలంధర్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీదేవి పల్లెలో సేవాలాల్ మహారాజ్ జయంతి లక్ష్మీదేవి పల్లెలో సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కూడా ఆమె పాల్గొన్నారు. సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గం సమాజానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తేలు రాజు, సాగి సత్యం రావు, ధర్మానాయక్ తండా సర్పంచ్ భుక్య సంతోష్, ఉప సర్పంచ్ చిరంజీవి, టెంపుల్ చైర్మన్ దుబ్బ నాయక్, తిరుపతి, రంజిత్, రాజేష్, ఎండబెట్ల ప్రసాద్, సాంబారి గంగాధర్, జలంధర్, నరేష్, రమేష్, జలపాతి, సుమన్, విక్రమ్, గోపాల్ నాయక్, ప్రభాకర్, సుందర్ తదితరులు పాల్గొన్నారు. #Sarangapur #DavaVasanthaSuresh #SevalalJayanthi #VenkateswaraSwamy #TelanganaNews #SpiritualEvents Follow us on Website Facebook Instagram YouTube