వైసీపీలో చేరిన శ్రీకాళహస్తి కాపు సంఘం అధ్యక్షుడు గరికపాటి చంద్ర
- ముస్లిం మైనారిటీ నాయకుల సన్మానం
- జగన్ నాయకత్వంపై నమ్మకంతో చేరిక
గరికపాటి చేరికతో పార్టీ మరింత బలోపేతం: వైసీపీ నాయకులు
శ్రీకాళహస్తి, | ఎన్ టుడే న్యూస్:
శ్రీకాళహస్తి నియోజకవర్గ కాపు సంఘం అధ్యక్షుడు, జనసేన నాయకుడు గరికపాటి చంద్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన వైసీపీలో చేరడంతో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
గరికపాటి చంద్ర వైసీపీలో చేరిన సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు, వార్డు సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు పఠాన్ ఫరీద్‌తో పాటు ఫజల్, జుమేషా, కాలేషా, ఫిరోజ్, షాకీర్, శివ, హుమైన్ షైక్, అమ్మన్, దివ్యాకాంత్ రెడ్డి, లోకేష్ రెడ్డి, షేక్ అమీర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో పాటు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై గరికపాటి చంద్ర వైసీపీలో చేరారని తెలిపారు. ఆయన చేరికతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.