BREAKING
thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం
Date of Publish : 16 October 2026, 07:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్సులు చేస్తే కఠిన చర్యలు తప్పవు: సీవీ ఆనంద్ హెచ్చరిక

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Oct, 2026 - 07:20 PM
12 వీక్షణలు

తెలంగాణ: పోలీసు యూనిఫామ్ ధరించి డ్యాన్సులు చేయడం, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనే విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. ఇటీవల కొందరు పోలీసులు యూనిఫామ్‌లో డ్యాన్సులు చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసు శాఖ క్రమశిక్షణ, యూనిఫామ్ గౌరవంపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో స్పందించిన డీజీపీ, పోలీసు యూనిఫామ్ అనేది కేవలం దుస్తులు మాత్రమే కాదని, అది బాధ్యతకు, అధికారానికి, క్రమశిక్షణకు ప్రతీక అని స్పష్టం చేసినట్లు సమాచారం. విధి నిర్వహణలో ఉన్నా, ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నా పోలీసు సిబ్బంది శాఖ ప్రతిష్ఠకు భంగం కలగకుండా వ్యవహరించాలని సూచించారు. యూనిఫామ్ ధరించి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం, దాని గౌరవాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడటాన్ని సహించబోమని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. పోలీసు శాఖలో క్రమశిక్షణను కాపాడటంతో పాటు ప్రజల్లో పోలీసులపై ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి సిబ్బంది బాధ్యత అని స్పష్టం చేశారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తా కథనం పేర్కొంది.