BREAKING
thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం
Date of Publish : 21 October 2026, 08:56 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఎన్నికల వేళ అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
21 Oct, 2026 - 08:56 AM
14 వీక్షణలు

పుంగనూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్‌

ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: జిల్లా ఎస్పీ

పుంగనూరు, అన్నమయ్య జిల్లా | ఎన్ టుడే న్యూస్: ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఓటర్లలో ధైర్యం, భద్రతా భావం కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు పోలీసు బలగాలు ఈ కార్యక్రమాలను చేపడుతున్నాయి.

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఓటర్లను భయపెట్టడం, ప్రలోభాలకు గురిచేయడం లేదా ఇతర అక్రమాలకు పాల్పడడం వంటి చర్యలను సహించబోమని స్పష్టం చేశారు.

అక్రమాలు కనిపిస్తే 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలి

ఎన్నికల సమయంలో ఎక్కడైనా ఓటర్లను బెదిరించినా, ఎన్నికల అక్రమాలు జరిగినట్లు గుర్తించినా ప్రజలు వెంటనే డయల్ 100 లేదా 112కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.