BREAKING
thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
Date of Publish : 18 October 2026, 03:29 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
18 Oct, 2026 - 03:29 PM
15 వీక్షణలు

పుంగనూరు మున్సిపల్ నామినేషన్ కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు

పుంగనూరు, అన్నమయ్య జిల్లా (ఎన్ టుడే న్యూస్): మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు. నామినేషన్ల ముగింపు నేపథ్యంలో పుంగనూరులోని బసవరాజ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ నామినేషన్ కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మదనపల్లె డీఎస్పీ బి. ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు, స్థానిక పోలీసులతో పాటు ఏఆర్, స్పెషల్ పార్టీ బలగాలను మోహరించారు. నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా సాగేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.

నామినేషన్ కేంద్రం పరిసరాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా పోలీసులు నిరంతరం నిఘా ఉంచారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.