BREAKING
thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు
Date of Publish : 18 October 2026, 01:39 pm
Posted by : BOYA SWAMY

సుదర్శన క్రియ, యోగ, ధ్యానం విజయానికి బలమైన పునాది

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిన్నకాపర్తి
Reporter
Boya Swamy Chityala Mandal
18 Oct, 2026 - 01:39 PM
8 వీక్షణలు

చిన్న కాపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ కోర్సు ముగింపు కార్యక్రమం

చిన్న కాపర్తి, అక్టోబర్ 18 (ఎన్ టుడే న్యూస్): ప్రతిరోజూ సుదర్శన క్రియ, యోగ, ధ్యానం సాధన చేయడం ద్వారా ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం పెంపొందించుకోవచ్చని, ఇవి జీవితంలో విజయాలను సాధించడానికి బలమైన పునాదిగా నిలుస్తాయని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్, యోగా టీచర్ పల్లపు బుద్ధుడు అన్నారు.

చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాపీనెస్ కోర్సు ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు షార్ట్ సుదర్శన క్రియ, యోగ, ధ్యాన సాధనలను నిర్వహించారు.

ఈ సందర్భంగా పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ, యోగాసనాలు, సూర్యనమస్కారాలు, పద్మసాధన, త్రీ స్టేజ్ ప్రాణాయామం, భస్త్రిక, ధ్యాన సాధనల ద్వారా శారీరక, మానసిక సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చని తెలిపారు. ఏకాగ్రత, సానుకూల ఆలోచనా విధానం, ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ సాధనలు దోహదపడతాయని వివరించారు.

ధ్యానం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ఆయన సూచించారు. ప్రతిరోజూ కనీసం పది నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందడంతో పాటు ఒత్తిడిని నియంత్రించుకోవచ్చని పేర్కొన్నారు. గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ సూచించిన సుదర్శన క్రియ ద్వారా అంతర్గత శక్తిని గుర్తించి ప్రశాంతమైన, ఆనందమయమైన జీవితాన్ని గడపవచ్చని తెలిపారు.

శాంతియుత సమాజ నిర్మాణానికి ధ్యానం, సేవాభావం, మానవీయ విలువలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామంలో యువత, విద్యార్థుల కోసం ఇలాంటి యోగ, ధ్యాన శిక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని పలువురు కోరారు.

గుత్తా అమిత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు

హ్యాపీనెస్ కోర్సు నిర్వహణకు సహకరించిన గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డికి పల్లపు బుద్ధుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో యోగా టీచర్ పల్లపు బుద్ధుడిని శాలువాలతో సన్మానించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్, పల్లపు ప్రశాంత్, పొలిమేర దశరథ, శేఖర్, ఆవుల రమేష్, వలిగొండ సత్యనారాయణ, శిలివేరు పరమేష్, గురిజ శంకరయ్య, దయాకర్, ఈరమళ్ల శ్రీను, ఈరమళ్ల వెంకన్న, శ్రీను, మహేష్, నరసింహ, స్వామి తదితరులతో పాటు భవాని మాలధారణ స్వాములు, యువకులు పాల్గొన్నారు.