BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 01 September 2026, 07:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ట్రాన్స్‌జెండర్స్‌కు స్వయం ఉపాధి అవకాశాలపై దృష్టి

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 07:51 PM
62 వీక్షణలు

ట్రాన్స్‌జెండర్స్‌కు స్వయం ఉపాధి అవకాశాలపై దృష్టి : పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఖమ్మం జిల్లా ఖమ్మం:

ట్రాన్స్‌జెండర్స్ సమాజంలో అందరితో సమానంగా గౌరవంగా జీవించేలా స్వయం ఉపాధి అవకాశాలు పొందేందుకు ప్రయత్నాలు చేయాలని, అందుకు అవసరమైన సహకారం అందించేలా చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.

మంగళవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ట్రాన్స్‌జెండర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ శుభకార్యాలు, వివాహాలు, ఇతర కార్యక్రమాలకు వెళ్లి ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు.

ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా వ్యవహరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే సమయంలో ట్రాన్స్‌జెండర్స్‌పై ఉన్న వివక్షను తొలగించి సమాజంలో గౌరవంగా జీవించేలా, స్వయం ఉపాధి మార్గాల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందేలా పోలీస్ శాఖ తరఫున సహకారం అందిస్తామని తెలిపారు.

ట్రాన్స్‌జెండర్స్‌కు జీవనోపాధి అవకాశాల కోసం పోలీస్ అధికారులు చొరవ చూపడం సానుకూల పరిణామమని పలువురు ట్రాన్స్‌జెండర్స్ హర్షం వ్యక్తం చేశారు.