BREAKING
thumb ● ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ శాసనసభాపతి, శాసనమండలి చైర్మన్ thumb ● చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పర్సబోయిన నరసింహ thumb ● రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జెస్సు అనిల్ కుమార్‌కు ఘన సన్మానం thumb ● నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు thumb ● ఆర్మూర్ జ్యోతిర్లింగ గుడిలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అన్నదానం thumb ● కోమన్నూతల, చెరోపల్లె గ్రామాల్లో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం thumb ● కార్యకర్తలు అధైర్యపడొద్దు.. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి thumb ● హైకోర్టులో న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేసిన పుట్టపాక యువకుడు thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించండి thumb ● ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ శాసనసభాపతి, శాసనమండలి చైర్మన్ thumb ● చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పర్సబోయిన నరసింహ thumb ● రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జెస్సు అనిల్ కుమార్‌కు ఘన సన్మానం thumb ● నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు thumb ● ఆర్మూర్ జ్యోతిర్లింగ గుడిలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అన్నదానం thumb ● కోమన్నూతల, చెరోపల్లె గ్రామాల్లో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం thumb ● కార్యకర్తలు అధైర్యపడొద్దు.. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి thumb ● హైకోర్టులో న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేసిన పుట్టపాక యువకుడు thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించండి
మంచి మాట
Date of Publish : 26 October 2026, 01:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రగడవరం మెయిన్ విలేజ్‌లో జోరుగా టీడీపీ ప్రచారం ఎంపీటీసీ-4 అభ్యర్థి కొనకళ్ల రాజుకు ప్రజల మద్దతు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Oct, 2026 - 01:18 PM
11 వీక్షణలు

ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రగడవరం ఎంపీటీసీ-4 స్థానం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి కొనకళ్ల రాజు సోమవారం గ్రామంలోని మెయిన్ విలేజ్‌లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి, ప్రజాస్వామ్య పాలనే లక్ష్యంగా తమకు మద్దతు ఇచ్చి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గ్రామాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఓటర్లకు వివరించారు. అభివృద్ధికి ఓటేయండి.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి అనే నినాదంతో కొనకళ్ల రాజు సాగించిన ప్రచారానికి స్థానికుల నుంచి మద్దతు లభిస్తోందని టీడీపీ నాయకులు తెలిపారు. ఎంపీటీసీ-4 స్థానంలో తమ అభ్యర్థి విజయం సాధిస్తారనే ధీమాను వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కనమత రెడ్డి రాజారెడ్డి, చిలుకూరి శ్రీనివాసరెడ్డి, జగ్గవరపు శ్రీనివాసరెడ్డి, భీమిరెడ్డి సత్యనారాయణరెడ్డి, సీనియర్ నాయకులు ముప్పిడి సూర్యం, బేతి నాగేష్, కొప్పెర్ల నాగరాజు, చక్రపు వీర వెంకయ్య, చక్రపు మారేశ్వరరావు, సేవా రాములు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.