ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
- వైసీపీ అభ్యర్థి షరీఫా బి నామినేషన్ ఉపసంహరణ
- 32 వార్డుల్లో టీడీపీకి 22, వైసీపీకి 8, జనసేనకు 2
- వార్డుల వారీగా పార్టీల బలం
ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా | ఎన్ టుడే న్యూస్: ఆళ్లగడ్డ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన షేక్ అనీషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ అభ్యర్థి షరీఫా బి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో షేక్ అనీషా ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి కిశోర్ బాబు వెల్లడించారు.
ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉన్నాయి. వీటిలో టీడీపీ 22 వార్డులు, వైసీపీ 8 వార్డులు, జనసేన 2 వార్డులను దక్కించుకున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు.
టీడీపీకి మెజారిటీ ఉండటంతో పాటు, వైసీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో చైర్‌పర్సన్ ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయింది.