చనుబండ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా తీర్ధాల అబ్బుత రావు ఖరారు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు తీర్థాల అబ్బుత రావు ను తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. శనివారం చనుబండ గ్రామంలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల సమావేశంలో ఆయన అభ్యర్థిత్వంపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో తెలుగురైతు నియోజకవర్గ అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు చీదిరాల మారేశ్వరరావు, నక్కా రాము, తేనేటి కిరణ్, పరసా శ్రీను తదితరులు పాల్గొన్నారు.