BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 15 October 2026, 10:23 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఎల్‌నినో ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వ అప్రమత్తత

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
15 Oct, 2026 - 10:23 PM
10 వీక్షణలు

తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక కార్యాచరణ

వర్షాభావ పరిస్థితులున్న 215 మండలాలకు సాయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం

కేంద్రం నుంచి రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీకి విజ్ఞప్తి

హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. రాబోయే ఎనిమిది నెలలు కీలకమని పేర్కొన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.. తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సరఫరాకు సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

నీటి వినియోగంపై ప్రత్యేక దృష్టి

జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో అక్టోబర్ 10న ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. రైతులు సాగు చేసిన పంటలు చేతికొచ్చే వరకు నీటి కొరత లేకుండా చూడాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని ఆదేశించారు. ఒక్క చుక్క నీరు కూడా వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

విద్యుత్ సరఫరాపై పర్యవేక్షణ

రానున్న రోజుల్లో విద్యుత్ కొరత పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అందుబాటులో ఉన్న విద్యుత్‌ను సమర్థంగా వినియోగించాలని, సాధ్యమైన చోట విద్యుత్ అధికంగా అవసరమయ్యే పనులను తాత్కాలికంగా వాయిదా వేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.

కేంద్రం నుంచి రూ.20 వేల కోట్ల సాయం కోరిన ప్రభుత్వం

రాష్ట్రంలో సుమారు 215 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కరువు సహాయం అందించాలని, రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం ఉన్న 125 రోజులకు అదనంగా మరో 50 రోజుల ఉపాధి కల్పించాలని కేంద్రాన్ని కోరాలని అధికారులకు సూచించింది.

ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దసరా తర్వాత వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు వార్‌రూమ్, టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు.

అఖిలపక్ష సమావేశం నిర్వహించే అంశాన్ని మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.