తిరుమలలో సిఫారసు లేఖలకు తాత్కాలిక బ్రేక్
ఆంధ్రప్రదేశ్
/
తిరుపతి
తిరుమల, అక్టోబర్ 21: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలను తాత్కాలికంగా అనుమతించబోమని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంతకాలం సిఫారసు లేఖల ద్వారా దర్శనం, వసతి సదుపాయాలు కల్పించబోమని తెలిపింది. అయితే, స్వయంగా తిరుమలకు వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులకు నిబంధనల ప్రకారం దర్శనం, వసతి సదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొంది. ఎన్నికల నియమావళి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.