బేస్తవారిపేట నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
- వైసీపీ అభ్యర్థులను టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారంటూ ఆందోళన
- నాయకులు, పోలీసుల మధ్య తోపులాట.. పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు
బేస్తవారిపేట | ఎన్ టుడే న్యూస్: బేస్తవారిపేట పట్టణంలోని నామినేషన్ కేంద్రం వద్ద బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న నాయకులకు, పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అప్రమత్తమైన పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను అదుపు చేశారు.
పోలీసుల జోక్యంతో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత కొంత తగ్గింది. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.