తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బోనాల వేడుకలు
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న లయోలా టెక్నో స్కూల్ నందు శ్రీకృష్ణ జన్మాష్టమి మరియు బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. విద్యార్థులు వివిధ వేషాధారణలలో బోనం ఎత్తుకొని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా వృత్య ప్రదర్శనలు చేశారు. మరి కొంతమంది చిన్నారులకు కృష్ణుడి వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను కూడా విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో బోనాలను అలంకరించి ప్రదర్శన నిర్వహించగా, విద్యార్థులు పోతురాజు వేషధారణలో ఆకట్టుకున్నారు. జానపద నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎండి. బషీరుద్దీన్, డైరెక్టర్లు ఉపా లేఖ కిరణ్, మార్గాల విష్ణు, ఎల్లం శ్రవణ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.