BREAKING
thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
Date of Publish : 03 September 2026, 09:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో 28 వార్డుల ఫోటో ఓటర్ల జాబితా సిద్ధం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 09:37 PM
56 వీక్షణలు

ప్రజల పరిశీలనకు అందుబాటులో.. తప్పులుంటే సరిచూసుకోవాలని కమిషనర్ సూచన

తిరువూరు, సెప్టెంబర్ 3: తిరువూరు పురపాలక సంఘ పరిధిలోని 28 వార్డులకు సంబంధించిన ఫోటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం విజయవాడ జారీ చేసిన సర్క్యులర్ నంబర్ 401/SEC-F2/2026-4, తేదీ 12.08.2026 ఆదేశాల మేరకు ఈ జాబితాలను రూపొందించినట్లు వెల్లడించారు.

పట్టణ ప్రజల సౌకర్యార్థం ఫోటో ఓటర్ల జాబితాలను మూడు ప్రధాన కార్యాలయాల్లోని నోటీసు బోర్డులపై అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. తిరువూరు పురపాలక సంఘ కార్యాలయం, మండల రెవెన్యూ అధికారి కార్యాలయం, రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాల్లో జాబితాలను పరిశీలించవచ్చని పేర్కొన్నారు.

పట్టణంలోని ప్రతి ఓటరు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని కమిషనర్ సూచించారు. పేరులో, చిరునామాలో లేదా ఇతర వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని గుర్తించాలని కోరారు. ఓటర్ల జాబితాలో తమ వివరాలను ముందుగానే సరిచూసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎన్నికల సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను నివారించవచ్చని తెలిపారు.

పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.