BREAKING
thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం thumb ● నీటి ఎద్దడి నివారణకు గ్రామసభల్లో అవగాహన thumb ● జాతీయస్థాయి రగ్బీ పోటీలకు వెల్లంకి విద్యార్థినులు ఎంపిక thumb ● బీజేపీ సీనియర్ నాయకుడు సుర్వి జంగయ్యకు నేతల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన thumb ● ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం thumb ● నీటి ఎద్దడి నివారణకు గ్రామసభల్లో అవగాహన thumb ● జాతీయస్థాయి రగ్బీ పోటీలకు వెల్లంకి విద్యార్థినులు ఎంపిక thumb ● బీజేపీ సీనియర్ నాయకుడు సుర్వి జంగయ్యకు నేతల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన thumb ● ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు
Date of Publish : 22 October 2026, 05:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి.. భద్రతా చర్యలు పటిష్టం చేయాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Oct, 2026 - 05:46 PM
27 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: తిరువూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశా పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పట్టణంలోని జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి, అక్కడ చేపట్టిన ఏర్పాట్లు, భద్రతా చర్యలను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేయాలని, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటిస్తూ, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అధికారులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశా కోరారు.