BREAKING
thumb ● ఘనంగా గంగమ్మ తల్లి జలాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ thumb ● ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలి: కే.బి.ఆర్. నాయుడు thumb ● అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తుటపల్లి రవికుమార్ thumb ● యువ నాయకుడు చిత్రగంటి ప్రవీణ్ మృతి బాధాకరం thumb ● శివన్నగూడెం రిజర్వాయర్కి ఏదుల నుండి నీటి తరలింపులో రాజగోపాల్ రెడ్డి కృషి thumb ● ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ శాసనసభాపతి, శాసనమండలి చైర్మన్ thumb ● చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పర్సబోయిన నరసింహ thumb ● రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జెస్సు అనిల్ కుమార్‌కు ఘన సన్మానం thumb ● నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు thumb ● ఘనంగా గంగమ్మ తల్లి జలాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ thumb ● ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలి: కే.బి.ఆర్. నాయుడు thumb ● అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తుటపల్లి రవికుమార్ thumb ● యువ నాయకుడు చిత్రగంటి ప్రవీణ్ మృతి బాధాకరం thumb ● శివన్నగూడెం రిజర్వాయర్కి ఏదుల నుండి నీటి తరలింపులో రాజగోపాల్ రెడ్డి కృషి thumb ● ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ శాసనసభాపతి, శాసనమండలి చైర్మన్ thumb ● చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పర్సబోయిన నరసింహ thumb ● రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జెస్సు అనిల్ కుమార్‌కు ఘన సన్మానం thumb ● నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు
మంచి మాట
Date of Publish : 26 October 2026, 06:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి మూడు రోజుల పాటు వరి కోతలు వాయిదా వేసుకోవాలిఏవో బి శివశంకర్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Oct, 2026 - 06:02 PM
19 వీక్షణలు

పంట నష్ట నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ప్రస్తుత ఖరీఫ్‌ 2026 సీజన్‌లో సుమారు 10 వేల ఎకరాల్లో వరి, పత్తి, మిరప పంటలను రైతులు సాగు చేశారు. ప్రస్తుతం చాట్రాయి, బూరుగుగూడెం, ఆరుగొలనుపేట గ్రామాల్లో వరి పంట కోత దశకు చేరుకోగా, మిగిలిన గ్రామాల్లో మరో పది రోజుల్లో కోతకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్నాబ్ తుఫాను హెచ్చరికల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ సూచించారు. రానున్న మూడు రోజుల పాటు వరి కోతలను వాయిదా వేసుకోవడం ద్వారా పంట దిగుబడిపై వర్షాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. పొలాల్లో అధికంగా చేరిన వర్షపు నీటిని కాలువల ద్వారా బయటకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే కోసిన వరి ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాల్లో ఆరబెట్టాలని, వర్షం పడే అవకాశం ఉన్నప్పుడు టార్పాలిన్లతో పూర్తిగా కప్పి ఉంచాలని కోరారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నాణ్యత దెబ్బతినకుండా, పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. వాతావరణ శాఖ జారీ చేసే తుఫాను హెచ్చరికలు, వ్యవసాయ శాఖ సూచనలను రైతులు తప్పనిసరిగా పాటిస్తూ తమ పంటలను కాపాడుకోవాలని బి. శివశంకర్ విజ్ఞప్తి చేశారు.