BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 19 January 2026, 08:06 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

సీఎం కప్ విజయవంతం చేయాలి

తెలంగాణ
19 Jan, 2026 - 08:06 PM
341 వీక్షణలు
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ విజయవంతం చేయాలి: అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే NTODAY NEWS: గొల్లపల్లి మండలం ప్రతినిధి లక్ష్మణ్  కరీంనగర్ జిల్లా కేంద్రం, ముఖ్యమంత్రి కప్ (CM Cup) క్రీడా పోటీలను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సీఎం కప్ నిర్వహణపై ఆమె అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి సీఎం కప్ పోటీలు మంచి వేదికగా నిలుస్తాయని అన్నారు. పోటీల ప్రతి దశలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనేలా మండల స్థాయి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, సమావేశంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ పవన్ కుమార్, ఎస్‌జీఎఫ్ (SGF) సెక్రటరీ వేణుగోపాల్, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఎస్‌జీఎఫ్ ప్రతినిధులు, వ్యాయామ దర్శకులు మరియు వివిధ క్రీడల కోచ్‌లు పాల్గొన్నారని తెలిపారు. సీఎం కప్ పోటీల షెడ్యూల్, నిర్వహణ బాధ్యతలపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు. #CMCup #SportsDevelopment #YouthSports #DistrictAdministration #AdditionalCollector #Karimnagar #GrassrootsSports #TelanganaSports #GovernmentInitiative Follow us on Website Facebook Instagram YouTube