BREAKING
thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● రూ.2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం thumb ● జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి thumb ● చౌడేపల్లిలో 9 జడ్పీటీసీ నామినేషన్ల ఆమోదం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● రూ.2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం thumb ● జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి thumb ● చౌడేపల్లిలో 9 జడ్పీటీసీ నామినేషన్ల ఆమోదం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం
మంచి మాట
Date of Publish : 25 October 2026, 10:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల బీ ఫారాల సమర్పణకు 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు గడువు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Oct, 2026 - 10:29 PM
19 వీక్షణలు

ఫ్యాక్స్, రబ్బరు స్టాంపు సంతకాలు చెల్లవు

 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల బీ ఫారాల సమర్పణకు ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే గడువు ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నామినేషన్ల ఉపసంహరణకు నిర్ణయించిన గడువులోపే రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు సంబంధించిన బీ ఫారాలను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియలో అనుసరించాల్సిన నిబంధనలను వెల్లడించింది. అభ్యర్థులకు సంబంధించిన ఫారం-ఏను సంబంధిత జిల్లా కలెక్టర్లకు, ఫారం-బీని రిటర్నింగ్ అధికారులకు అందజేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. ఫారం-ఏపై రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి స్వయంగా ఇంక్ పెన్నుతో సంతకం చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఫ్యాక్స్ ద్వారా పంపిన సంతకాలు, రబ్బరు స్టాంపుతో వేసిన సంతకాలను ఆమోదించబోమని తేల్చిచెప్పింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లు అధికారికంగా గుర్తింపు పొందే ప్రక్రియలో బీ ఫారాలు కీలకమైనవి కావడంతో రాజకీయ పార్టీలు గడువును దృష్టిలో ఉంచుకుని అవసరమైన పత్రాలను సకాలంలో సమర్పించాలని సూచించింది. నిర్ణీత గడువు, సంతకాల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.